Bengaluru Rains | వరదపాలైన రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు!
Bengaluru Rains | బెంగళూరు (Bengaluru Rains) మహానగరాన్ని గత కొన్ని రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరదల కారణంగా మల్లీశ్వర్ (Malleswar) ప్రాంతంలోని ఓ నగల దుకాణం పెద్దమొత్తంలో నష్టపోయింది. రూ.కోట్లు విలువైన బంగారు ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Bengaluru Rains | బెంగళూరు (Bengaluru Rains) మహానగరాన్ని గత కొన్ని రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. బెంగళూరు విధానసౌధ, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
ఈ వరదల కారణంగా మల్లీశ్వర్ (Malleswar) ప్రాంతంలోని ఓ నగల దుకాణం పెద్దమొత్తంలో నష్టపోయింది. ఆ ప్రాంతంలోని తొమ్మిదవ క్రాస్‌లో ఉన్న నిహాన్ జ్యువెల్లరీ (Nihan Jewellery) అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో షాపులో ఉన్న రూ.కోట్ల విలువైన బంగారు నగలు (gold ornaments) వరదలో కొట్టుకుపోయినట్లు (washed away) దుకాణం యజమాని ప్రియ తెలిపారు. దుకాణం సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ వరదలకు కారణమని ఆరోపించారు.
‘షాపులోని బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. మున్సిపల్ అధికారులకు ఫోన్‌చేసి సాయం కోరినా వారు స్పందించలేదు. దుకాణంలోని 80 శాతం నగలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది’ అని దుకాణం యజమాని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

Nihaan Rains 2
కాగా, గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలమైంది. సోమవారం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన వడగళ్ల వాన అరగంటకు పైగా కొనసాగింది. దీంతో రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు, మురుగునీరు చేరింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. సుమారు 400కి పైగా చెట్లు నేలకూలాయి. వీటిని తొలగించేందుకు కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. పలు ప్రధాన రహదారులు గుంతల మయంగా మారాయి. వర్షం కారణంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు 600కు పైగా ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని మహాలక్ష్మి లేఅవుట్లో 20కి పైగా ఇళ్లు ముంపునకు గురైనట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read..
Virat Kohli | మరింత దృఢంగా తిరిగొస్తాం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిష్క్రమణపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
Sudha Murthy | 30 ఏళ్లుగా ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదు : సుధామూర్తి
Rahul Gandhi | లారీలో రాహుల్.. వారి సమస్యలను తెలుసుకునేందుకేనట..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

