Sudha Murthy | 30 ఏళ్లుగా ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదు : సుధామూర్తి
Sudha Murthy | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, సుధామూర్తి.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’ (Kapil Sharma Show) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Sudha Murthy | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. విద్యావేత్త, రచయిత, అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, సుధామూర్తి.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’ (Kapil Sharma Show) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
1981లో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయనకు పనే జీవితమైపోయిందన్నారు. అంకితభావంతో పనిచేసేవారని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండేవారని.. సెలవులే ఉండేవి కాదన్నారు. అందువల్ల 30 ఏళ్ల పాటు తామిద్దరం కలిసి ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదని తెలిపారు. నారాయణమూర్తి ఏడాదికి 220 రోజుల పాటు ప్రయాణాలు చేసేవారని చెప్పారు. ఇంటికి సంబంధించిన విషయాలను పూర్తిగా తనపైనే వదిలేశారని, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది కాదన్నారు. పిల్లలిద్దరి బాధ్యతను కూడా పూర్తిగా తనపైనే వదిలేశారని చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత నేను ఆయనకు ఎంత మద్దతిచ్చానో మూర్తికి అర్థమైందన్నారు. అప్పటి నుంచి తన కెరీర్‌ను కొనసాగించేందుకు అన్ని విధాలా సపోర్ట్‌గా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు.
Also Read..
Virat Kohli | మరింత దృఢంగా తిరిగొస్తాం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిష్క్రమణపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
Rahul Gandhi | లారీలో రాహుల్.. వారి సమస్యలను తెలుసుకునేందుకేనట..!
Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

