Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?
Jeff Bezos | తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)తో అమెజాన్ వ్యవస్థాపకుడు (Amazon founder) జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఎంగేజ్మెంట్ (Engagement) చేసుకున్నట్లు తెలుస్తోంది.
Jeff Bezos | తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)తో అమెజాన్ వ్యవస్థాపకుడు (Amazon founder) జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఎంగేజ్మెంట్ (Engagement) చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పేజ్ సిక్స్ ( Page Six) నివేదించింది. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival ) కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా లారెన్ ఓ హార్ట్ షేప్‌లో ఉన్న రింగ్‌ను ధరించి కనిపించింది. ఆమె చేతికి ఉన్నది ఎంగేజ్మెంట్ రింగ్ అయ్యి ఉంటుందని పేజ్ సిక్స్ తన కథనంలో పేర్కొంది.
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53 ఏళ్ల సాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
కాగా, అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి 2021లో వైదొలిగిన జెఫ్ బెజోస్.. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అంతరిక్ష విమానయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’తోపాటు వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికకు అధినేతగా కొనసాగుతున్నారు.
Also Read..
White House | శ్వేతసౌధం వద్ద ట్రక్కు బీభత్సం
Highway Accident: పుణె హైవేపై యాక్సిడెంట్.. ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

