The Kerala Story | ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టిన కేరళ స్టోరీ.. ప్రియుడిపై మతమార్పిడి కేసు పెట్టిన యువతి
The Kerala Story | విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం.. తాజాగా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది.
The Kerala Story | విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం.. తాజాగా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. ఈ వివాదాస్పద చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రేమజంట (Lovers) ఈ చిత్రాన్ని చూసింది. అనంతరం ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రియుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ ( Indore) లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ ఖజ్రానా పోలీసు స్టేషన్ (Khajrana police station) ప్రాంతంలో ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. యువకుడు మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కాగా, ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని చూసొచ్చారు. ఇంటికొచ్చాక సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది.
తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి కోసం తనని మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read..
White House | శ్వేతసౌధం వద్ద ట్రక్కు బీభత్సం
Ranchi | ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన మహిళ.. అంతా ఆడపిల్లలే
Gold Rush | బంగారం ధర రికార్డు స్థాయికి చేరినా పెరిగిన కొనుగోళ్లు.. ఎందుకో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

