Gold Rush | బంగారం ధర రికార్డు స్థాయికి చేరినా పెరిగిన కొనుగోళ్లు.. ఎందుకో తెలుసా?
బంగారం ధరలు (Gold prices) ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా పసిడి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. కారణం ఎంటో తెలుసా..
Gold Rush | బంగారం ధరలు (Gold prices) ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా పసిడి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. కారణం ఎంటో తెలుసా.. రూ.2 వేల నోట్లను (Rs.2,000 notes) ఆర్బీఐ (RBI) రద్దుచేయడం. నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద లైన్లు ఎందుకు కట్టాలనుకున్నారో ఏమో.. ఎప్పటికీ డిమాండ్ ఉండే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లోని బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి.
ముంబైలోని (Mumbai) జవేరి బజార్లో బంగారం కొనుగోలుదారులు రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నారు. గత వారంతో పోలిస్తే 10 గ్రాములకు రూ.485 మేర బంగారం ధర పెరిగింది. అయినప్పటికీ రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం కొనుగోళ్లపై పడలేదు. అయితే బంగారం కొనుగోళ్లు పెద్దగా ఏమీ లేవని ఇండియన్ బులియన్, జువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా (Surendra Mehta) అన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పోలిస్తే కొంతమేరకు రద్దీ తక్కువే ఉన్నట్టు చెప్పారు. అప్పుడు తులం బంగారం ధర రూ.30 వేలు మాత్రమే ఉందని, ప్రస్తుతం అది రూ.60 వేలకు చేరిందన్నారు. బంగారం రేట్లు చుక్కలను అంటడంతో డిమాండ్ కాస్తా తగ్గిందని చెప్పారు. అయితే గతవారంతో పోలిస్తే కొనుగోళ్లు రెట్టింపయ్యాయని తెలిపారు.

ఇక కోల్‌కతాలో (Kolkata) నగల కొనుగోళ్లు 15-20 శాతం పెరిగాయన్నారు. 2016 నాటి పరిస్థితులు లేవని, బంగారం దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకుంటున్నారని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు అశోక్ బెగాని అన్నారు. అయితే రూ.50 వేలు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు సంబంధించి వినియోగదారులు కేవైసీ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలకు పాన్‌కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని, రూ.10 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

