Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదు సెషన్ల నష్టాలకు శుక్రవారం బ్రేక్ పడింది. శనివారం ఎగ్జిట్ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్పంగా పుంజుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 76 పాయింట్ల లబ్ధితో 73,961 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 22,531 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫైనాన్సియల్ షేర్ల కొనుగోళ్లు ఇండెక్సులకు కలిసి వచ్చింది. చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో స్టాక్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి
నెల రోజులకు పైగా సాగిన సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగియనున్నది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నాడిని శనివారం సాయంత్రం వార్తా సంస్థలు వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్స్ లబ్ధి పొందగా, నెస్లే ఇండియా, టీసీఎస్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.