బుధవారం 03 జూన్ 2020
Business - May 03, 2020 , 02:24:08

శభాష్‌ ఇండియా: మజుందార్‌ షా

శభాష్‌ ఇండియా: మజుందార్‌ షా

బెంగళూరు, మే 2: ఇతర దేశాలతో పోల్చితే  కరోనా వైరస్‌ను భారత్‌ సమర్థవంతంగా కట్టడి చేస్తున్నదని బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ప్రశంసించారు. ఈ మహమ్మారి ప్రభావం తీవ్రం గా ఉన్న ప్రాంతాలనే రెడ్‌ జోన్లు గా ప్రకటించాలని ప్రభుత్వాలకు ఆమె సూచించారు. ఏకంగా జిల్లాలనే రెడ్‌ జోన్లుగా ప్రకటించవద్దని, దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శనివారం షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిల్లా యం త్రాంగాలను కరోనా ని ర్మూలనలో భాగం చే యాలని కోరారు. స్థానిక ప్రజలకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారి కి చికిత్సను అందించేలా ఆదేశాలు జారీ చేస్తే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా, ఐరోపా దేశాలు కరోనాను తేలిగ్గా తీసుకున్నాయని, అందుకే ఎక్కువగా నష్టపోయాయన్నారు.


logo