Work from Home End | వర్క్ ఫ్రం హోంకు తెర.. జనవరి నుంచి ఇక ఆఫీసుల నుంచే ఐటీ సేవలు
Work from Home End | వర్క్ ఫ్రం హోం తుది దశకు చేరుకున్నది. వచ్చే ఏడాది నుంచి మెజారిటీ ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కానున్నారు.

Work from Home End | కరోనా మహమ్మారి వల్ల గతేడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం సంస్కృతి ముగింపు దశకు చేరుకున్నది. ప్రత్యేకించి శరవేగంగా వర్క్ ఫ్రం హోం సంస్కృతిలో భాగమైన ఐటీ సేవల రంగం ఉద్యోగులు ఆఫీసులకు రావడం మొదలైంది. ఉద్యోగులు, యాజమాన్యాలు వర్క్ ఫ్రం ఆఫీసు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, ఓ పోర్టల్ నిర్వహించిన సర్వేలో తేలింది. అదీ కూడా హైబ్రీడ్ మోడల్లో అమలు చేయాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. 2022 ప్రారంభం నుంచి సగానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ సేవలందించనున్నారని నాస్కామ్ రిటర్న్ టు వర్క్ ప్లేస్ సర్వేలో తేలింది. అయితే కనీసం వారానికి మూడు వారాలు వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీ అమల్లోకి రాబోతున్నది.
70 శాతం కంపెనీలు హైబ్రీడ్ మోడల్‌కు మొగ్గు
70 శాతం కంపెనీలు హైబ్రీడ్ మోడల్‌కు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ సర్వీసెస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అతి త్వరలోనే దీర్ఘకాలిక హైబ్రీడ్ వర్క్ మోడల్ అమలుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 50 శాతం సిబ్బందిని ఆఫీసులకు రప్పించేందుకు 72 శాతం సంస్థలు ముందడుగు వేయనున్నాయి.
టీసీఎస్‌లో 15 నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్
దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ నెల 15 నుంచి సిబ్బంది తాము నియమితులైన కేంద్రాల్లో ఆఫీసులకు రావాల్సిందిగా కోరింది. అయినప్పటికీ భవిష్యత్‌లో 25/25 మోడల్ అమలు చేయనున్నది. 25/25 ప్రకారం 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. 2025 నాటికి 25 శాతం మంది సిబ్బంది మాత్రమే ఆఫీసులకు వస్తారు. ప్రాజెక్ట్ టీమ్స్‌లో మాత్రమే 25 శాతం ఉద్యోగులు ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం టీసీఎస్‌లో ఐదు శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో సేవలందిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించనున్నది. అటుపై క్రమంగా దశలవారీగా 25/25 మోడల్ అమలు చేయబోతున్నది.
భారత్, అమెరికా, బ్రిటన్లలో ఇన్ఫీ వర్క్ ఫ్రం హోం
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులు చైనాలో 91 శాతం మంది ఆఫీసుల నుంచే పని చేస్తున్నారు. భారత్, అమెరికా, బ్రిటన్లలో 98.5 శాతం మంది వర్క్ ఫ్రం హోం.. దక్షిణాసియా దేశాల్లో 80 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారని ఇన్ఫీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్‌రావు చెప్పారు. భారత్‌లో సీనియర్ లీడర్లను వారానికొసారి ఆఫీసు రావాలని కోరుతున్నది ఇన్ఫీ. మిడిల్ మేనేజ్మెంట్, 25-40 ఏండ్ల మధ్య వయస్సు గల వారు ఆఫీసులకు వచ్చి విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు.
హెచ్‌సీఎల్‌లో దశల వారీగా వర్క్ ఫ్రం ఆఫీస్
విప్రోలో ప్రపంచవ్యాప్తంగా 85 శాతానికి పైగా సిబ్బంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. 50 శాతం మంది రెండు డోస్‌లు వేయించుకున్నారు. భారత్‌లో పూర్తిగా వ్యాక్సిన్ డోస్‌లు వేసుకున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి విధులు చేపట్టారు. ఇక నోయిడా కేంద్రంగా పని చేస్తున్న హెచ్‌సీఎల్‌లో 90 శాతం సిబ్బంది, వారి కుటుంబాల్లో కొందరు పూర్తిగా, కొందరు తొలి డోస్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా వర్క్ ఫ్రం ఆఫీసు విధానం అమలు చేయబోతున్నది. అయితే ఉద్యోగులను వర్క్ ఫ్రం ఆఫీసు సేవలు అందించాలని ప్రోత్సహిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- it giants
- Work From Home
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

