వాషింగ్టన్ : అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్పై 15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.3 లక్షల కోట్ల) పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
వివాదాస్పద లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్తో ట్రంప్ సంబంధాలపై ఆ పత్రిక వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో ఆగ్రహించిన ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘ఈ రోజు న్యూయార్క్ టైమ్స్పై 15 బిలియన్ డాలర్ల దావా వేసిన గౌరవం నాకు దక్కింది. ఇది మన దేశ చరిత్రలోనే అత్యంత చెత్త, దిగజారిన పత్రిక’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.