న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఫార్మాస్యూటికల్, మెడ్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టబోతున్నట్టు ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ అమిత్ అగర్వాల్ తెలిపారు.
ఫార్మా, మెడ్టెక్నాలజీ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కీం రూపకల్పన చేస్తున్నట్టు, ఈ స్కీం కింద రూ.5 వేల కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు చెప్పారు.