న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశవ్యాప్తంగా ఐఫోన్లకు గిరాకీ నెలకొన్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 17 మాడల్‌కు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన రావడంతో భారత్‌తోపాటు అమెరికాలో కంపెనీకి చెందిన రిటైల్ అవుట్లెట్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బుకింగ్‌లు ఆరంభించిన మూడు రోజుల్లోనే ఈ మాడల్ బుకింగ్‌లు నిలిపివేసింది.
భారత్‌లో ఐఫోన్ ప్రొ మ్యాక్స్ సీరిస్ మాడల్ భారత్‌లో లభించడం లేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు రూ.82,900 నుంచి రూ.2,29,900 లోపు భారత్‌లో లభించనున్నాయి.