హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వేలంపాటలో బంగారం అన్వేషణను దక్కించుకున్న సింగరేణి సంస్థ, మంగళవారం ఇందుకు సంబంధించిన లైసెన్స్‌ను అందుకున్నది. హైదరాబాద్ టీ-హబ్‌లో క్రిటికల్ మైనింగ్‌పై నిర్వహించిన సెమినార్లో కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నుంచి సింగరేణి సీఎండీ ఎన్ బలరాం లైసెన్స్‌ను అందుకున్నారు.
కర్ణాటకలోని దేవదుర్గ్ ప్రాంతంలో రాగి, బంగారం అన్వేషణ టెండర్‌ను సింగరేణి దక్కించుకున్న విషయం తెలిసిందే. 199 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అన్వేషణను చేపట్టనున్నది.