న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మొదటిసారి భారత్-అమెరికా మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. వీటిని ఉభయపక్షాలు ‘సానుకూలం’గా అభివర్ణించాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చల కోసం తీసుకోవలసిన తదుపరి చర్యల గురించి అమెరికా వాణిజ్య సహాయ ప్రతినిధి బ్రెండన్ భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌తో సానుకూల చర్చలు జరిపారని అమెరికా ఎంబసీ అధికార ప్రతినిధి తెలిపారు.
కొద్దిసేపటి తర్వాత భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటన కూడా ఇదే విధంగా స్పందిస్తూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు తీసుకోవలసి చర్యలను వేగవంతం చేయాలని ఉభయ దేశాలు నిర్ణయించాయని తెలిపింది.