Stock Markets | ముంబై, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం, అన్ని రంగాల్లో షేర్లు కుదేలవడంతో సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితికి తోడు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడం మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైంది. దీంతో అమ్మకాల బటన్ నొక్కడంతో సెన్సెక్స్ 81 వేల దిగువకు పడిపోయింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 930.55 పాయింట్లు లేదా 1.15 శాతం నష్టంతో 80,220.72 వద్ద ముగిసింది. ఆగస్టు 14 తర్వాత సూచీలకు ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. మరో సూచీ నిఫ్టీ కీలక మైలురాయి 24,500ని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 309 పాయింట్లు లేదా 1.25 శాతం నష్టపోయి 24,472.10 వద్ద ముగిసింది. దీంతో మదుపరుల లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. గత కొన్ని రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలడంతో మదుపరులు ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.9,19, 374.52 కోట్లు కరిగిపోయి రూ.4,44,45, 649.22 కోట్లకు(5.29 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.
స్టాక్ మార్కెట్లో లిైస్టెన తొలిరోజే హ్యుందాయ్ మోటర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇష్యూ ధర కంటే 1.47 శాతం తక్కువ ధరకే లిైస్టెన కంపెనీ షేరు మార్కెట్ ముగిసే సమయానికి 7 శాతానికి పైగా నష్టపోయింది. ఇంట్రాడేలో 7.80 శాతం నష్టపోయి రూ. 1,807.05 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 7.12 శాతం నష్టంతో రూ.1,820.40 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ 7.16 శాతం నష్టంతో రూ.1,819.60 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1, 47,914.98 కోట్లతో ఐదో అత్యంత విలువైన ఆటోమొబైల్ సంస్థగా అవతరించింది.
పేటీఎంకు చెందిన యూపీఐ సేవలు తిరిగి ప్రారంభంకాబోతున్నాయి. ఆర్బీఐ నిషేధం విధించడంతో ఈ ఏడాది జనవరి నుంచి నెలలుగా నిలిచిపోయిన ఈ యూపీఐ సేవలకు మంగళవారం నేషనల్ పేమెంట్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. దీంతో పేటీఎం నూతన యూపీఐ తిరిగి ప్రారంభంకాబోతున్నాయి.