ముంబై, జూలై 9: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు గురువారం కోలుకున్నాయి. ప్రారంభంలో 800 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 238.22 పాయింట్లు అందుకొని 76,741.82 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 80.75 పాయింట్లు ఎగబాకి 23,962.80 వద్ద ముగిసింది.
సూచీల్లో సన్‌ఫార్మా 2.7 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇంటర్గ్లోబల్ ఏవియేషన్, ఎటర్నల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా..ఇన్ఫోసిస్, మారుతి, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్‌లు నష్టపోయాయి.