న్యూఢిల్లీ, మే 8: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పాయింట్ల వద్ద నిలిచింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు తరలిరావడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని ట్రేడర్లు తెలిపారు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటోమొబైల్ షేర్లు ర్యాలీలో పాలుపంచుకున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీగా పెరగడం, సోమవారం ఉద యం ఆసియా సూచీలు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడం బుల్స్‌కు ఉత్సాహాన్నిచ్చిందని స్టాక్ నిపుణులు వివరించారు. ఇక ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.2.27 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,27,794 కోట్లు అధికమై రూ.2,76, 06,443 కోట్లకు చేరింది.