Dalal Street | నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 250 పాయింట్లు పతనం
Dalal Street : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండోసారి. బీఎస్ఈ సెన్సెక్స్ 249 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 77,005.51 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది.
Dalal Street : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండోసారి. బీఎస్ఈ సెన్సెక్స్ 249 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 77,005.51 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఒక దశలో 77,037.36 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 249.70 పాయింట్లు (0.30) నష్టపోయి 76,478.67 వద్ద నిలిచింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ50 80.50 పాయింట్లు (0.34%) నష్టపోయి 23,865.75 వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్ ఒత్తిడికి గురికావడం, అమెరికాకు చెందిన ఎకనామిక్ డాటా, ఫెడరల్ రిజర్వ్ ఇంటరెస్ట్ రేట్, ఇరాన్, అమెరికా మద్య ఒప్పందం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ సూచీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్ షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, టైటాన్, మారుతి సుజుకి సంస్థల షేర్లు లాభపడ్డాయి.
వీటిలో మారుతి సుజుకి షేర్లు ఏకంగా 5 శాతం లాభపడ్డాయి. నిఫ్టీలో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.25 డాలర్లుగా ఉంది. మరోవైపు రూపాయి విలువ స్వల్పంగా క్షీణించింది. డాలర్‌తో రూపాయి విలువ 94.66 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,025.73 డాలర్లుగా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

