Nirmala Sitaraman | కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ‘సాధారణ ఓబీసీ చాయ్‌వాలా మంచిగా దేశాన్ని నడిపించడం’ ఇండియా కూటమికి సమస్యగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌పై లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
2004-05 నుంచి కేంద్ర బడ్జెట్లలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంత మాత్రానా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు సమకూర్చలేదని అర్థమా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారన్న విపక్ష సభ్యుల విమర్శలను నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ‘2004-05 బడ్జెట్ ప్రసంగంలో 17 రాష్ట్రాలు, 2005-06లో 18, 2006-07లో 16, 2009-10లో 26 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదు. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించనట్లా? విపక్షాల ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
LTCG Tax | ఎల్టీసీజీ రద్దు ప్రతిపాదనే లేదు.. తేల్చేసిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
Gold – Silver Rates | భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించేనా..?!