న్యూఢిల్లీ, నవంబర్ 10: కోల్ ఇండియా ఈ జూలై-సెప్టెంబర్లో రూ.6,799.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,043.55 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది.
కంపెనీ విక్రయాలు రూ.27,538.59 కోట్ల నుంచి రూ.29,978.01 కోట్లకు చేరుకున్నాయని సంస్థ శుక్రవారం తెలిపింది.