Interest Rates | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను చిన్న మొత్తాల పొదుపు స్కీంలు, పీపీఎఫ్, ఎన్ఎస్సీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వడ్డీరేట్లు వర్తించనున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. వరుసగా వడ్డీరేట్లలో మార్పులు చేయకపోవడం ఇది వరుసగా మూడోసారి.