న్యూఢిల్లీ/ముంబై, ఆగస్టు 23: అనిల్ అంబానీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అతని కంపెనీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేయగా..తాజాగా సీబీఐ ఆయన కార్యాలయాలతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్..బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద తీసుకున్న రూ.2,929.05 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లింపులు జరపడంలో విఫలమైంది.
దీంతో ఆయనతోపాటు కంపెనీపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీబీఐ.. ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంతోపాటు అనిల్ అంబానీ ఇంట్లోనూ సోదాల్ నిర్వహించింది. నిందిత వ్యక్తులు నేరపూరిత కుట్రలో తప్పుగా ప్రాతినిథ్యం వహించి, రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్‌కు అనుకూలంగా ఎస్బీఐ నుంచి భారీ స్థాయిలో రుణాన్ని పొందారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇలా తీసుకున్న నిధుల దుర్వినియోగం, ఇతర విభాగాలకు మళ్లించడం, అమ్మకాల ఇన్వాయిస్ ఫైనాన్సింగ్‌ను దుర్వినియోగం చేయడం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ ద్వారా ఆర్‌కామ్ బిల్లులను డిస్కౌంట్ చేయడం, ఇంటర్-కంపెనీ డిపాజిట్ల ద్వారా నిధుల తరలింపు వంటి ఆరోపణలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.