e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్‌ ఫారాల్లో మార్పుల్లేవ్‌

ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్‌ ఫారాల్లో మార్పుల్లేవ్‌

ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్‌ ఫారాల్లో మార్పుల్లేవ్‌

ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్! 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిట‌ర్నుల ఫారంల‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేష‌న్ (సీబీడీటీ) గురువారం నోటిఫై చేసింది. ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్‌-7 వ‌ర‌కు కొత్త‌ ఫారంల‌ను ఏప్రిల్‌1న విడుద‌ల చేసింది. అయితే గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త ఫారంల‌లో చెప్పుకోగ‌ద‌గ్గ మార్పులేమీ చేయ‌లేదు. క‌రోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌న్ను చెల్లింపుదారుల సౌల‌భ్యం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 స‌వ‌ర‌ణ‌ల‌కు అనుగుణంగా అవ‌స‌ర‌మైన క‌నీస మార్పుల‌ను మాత్ర‌మే చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఫారంల‌లో తొలుత కొత్త ఐటీ ఫారం ఫైల్ చేయాల‌ని అనుకుంటున్నారా అనే ప్ర‌శ్న మాత్రం వ‌స్తుంద‌ని తెలియ‌జేసింది.

ఐటీఆర్ 1లో పన్ను అసెసీలు త్రైమాసికానికి తాము అందుకున్న డివిడెండును పేర్కొనాల్సి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉండే చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) ఉపయోగపడతాయి. ఈ ఐటీఆర్ 1 నుంచి 7 వ‌ర‌కు ఫారంలు ఎవ‌రికి ఏవి ఉప‌యోగ‌ప‌డ‌తాయో ఒక‌సారి చూద్దాం..

  • ఐటీఆర్ 1(స‌హ‌జ్‌) ఐటీఆర్ 4(సుగం) ఫారంను ఎక్కువమందికి ఉప‌యోగ‌ప‌డుతుంది. శాల‌రీ, ఇంటి ఆస్తి, వ‌డ్డీ మొద‌లైన వ‌న‌రుల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్ 1ను దాఖ‌లు చేస్తారు.
  • హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ, లిమిటెడ్ ల‌య‌బిలిటీ పార్ట‌న‌ర్‌షిప్ ఉన్న సంస్థ‌లు కాకుండా మిగిలిన కంపెనీలు, అలాగే వ్యాపారస్తులు ఐటీఆర్ 4 దాఖ‌లు చేస్తారు.
  • హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీకి చెందిన వారై వ్యాపారం లేదా వృత్తిప‌ర‌మైన‌ ఆదాయం లేని వ్య‌క్తులు ఐటీఆర్ 2 ను ఎంచుకుంటారు. వ్యాపారం, వృత్తిప‌ర ఆదాయం ఉన్న వారు ఐటీఆర్ 3 ఎంచుకుంటారు.
  • హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీకి చెంద‌ని భాగ‌స్వామ్య సంస్థ‌లు, లిమిటెడ్ ల‌యబిలిటీ పార్ట‌న‌ర్‌షిప్ సంస్థ‌లు ఐటీఆర్ 5ని, కంపెనీలు ఐటీఆర్ 6 ను దాఖ‌లు చేస్తాయి. అదే రాజ‌కీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థ‌లు ఐటీఆర్ 7ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఫ్యూచ‌ర్‌కు లైఫ్‌లైన్‌.. డీల్ అమ‌లుకు రిల‌య‌న్స్ 6 నెల‌ల టైం!

బ్యాంకులకు 1285 కోట్ల ఎగవేత

బంగారం ధ‌ర రూ.40 వేల దిగువ‌కు.. ఎందుకంటే?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్‌ ఫారాల్లో మార్పుల్లేవ్‌

ట్రెండింగ్‌

Advertisement