Canara Bank Special FD | ప్రభుత్వ రంగ బ్యాంక్.. కెనరా బ్యాంక్.. డిపాజిట్లను ఆకర్షించడానికి 666 రోజుల గడువుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. దీనిపై గరిష్టంగా 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. డిపాజిటర్లు రూ.2 కోట్ల లోపు వరకు డిపాజిట్ చేయొచ్చు. సాధారణ సిటిజన్లకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ అందిస్తున్నది.
`ఇప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్పై గరిష్ట రిటర్న్స్ పొందొచ్చు. ఇందుకోసం 666 రోజుల గడువు గల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద పెట్టుబడులపై 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు కెనరా బ్యాంకు ట్వీట్ చేసింది.ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90 నుంచి 5.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 2.90 నుంచి 6.25 శాతం వరకు వడ్డీ అందిస్తున్నది.
Now get maximum returns on your investment!
Presenting Canara Special Deposit Scheme that offers 7.50% interest by investing for 666 days. #CanaraBank #CanaraBankSpecialDepositScheme #666Days pic.twitter.com/I2WEoHzVQr
— Canara Bank (@canarabank) October 7, 2022
మరోవైపు ఇండ్ల రుణాలు సహా పలు లోన్లపై వడ్డీరేట్లు సవరించింది. రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచేస్తున్నట్లు కెనరా బ్యాంకు ప్రకటించింది. శుక్రవారం నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఓవర్నైట్ నుంచి నెల రోజుల ఎంసీఎల్ఆర్ గల రుణాలపై 15 బేసిక్ పాయింట్లు పెంచడంతో 7.05 శాతానికి, మూడు నెలల గడువు గల రుణాలపై 7.40 శాతం వడ్డీ అమల్లోకి వస్తుంది. ఆరు నెలల గడువు గల రుణంపై 7.80 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఏడాది గడువు గల రుణాలపై గరిష్టంగా 7.90 శాతం వడ్డీ విధిస్తుంది.