Sahil Khan | మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను (Sahil Khan) పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల పాటు ఛేదన తర్వాత ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు.
ముంబై: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను (Sahil Khan) పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల పాటు ఛేదన తర్వాత ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. మధ్యంతర బెయిల్‌కు ముంబై కోర్ట్ నిరాకరించడంతో సాహిల్ పరారయ్యడాని పోలీసులు తెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సహాయంతో 40 గంటలపాటు సాగిన ఆపరేషన్ తర్వాత అరెస్టుచేశామని వెల్లడించారు. ఆదివారం అతడిని ముంబైకి తరలిస్తామని, కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు.
ఈ నెల 13న ముంబై పోలీసుల ఎదుట సాహిల్ ఖాన్ హాజరయ్యాడు. ఈ కేసులో పలువురు స్టార్లతో పాటు నటుడు సాహిల్ పేరు సైతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు విచారణలో పాల్గొనేందుకు సాహిల్ ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మాతుంగా పోలీస్‌లో కేసు నమోదు కాగా.. కేసు దర్యాప్తు కోసం ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో డిసెంబర్ 2023లో ముంబై సైబర్ సెల్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాహిల్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్లో సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో సాహిల్ విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ కేసులో దాదాపు రూ.15వేలకోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను స్థానిక అధికారులు దుబాయిలో అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా దుబాయి పోలీసులు అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాహిల్ సినిమా నటుడే కాకుండా ఫిట్నెస్ నిపుణుడు కూడా. స్టయిల్, ఎక్స్క్యూజ్ మీ తదితర చిత్రాల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

