వంట గ్యాస్ బుకింగ్‌పై మరో బంఫర్ ఆఫర్ అందించేందుకు ముందుకు వచ్చింది ఆన్లైన్ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం. తద్వారా వంట గ్యాస్ కస్టమర్లపై వంట గ్యాస్ బుకింగ్ భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ అందిస్తున్నది. భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ గ్యాస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థల కస్టమర్లు మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటే రూ.2700 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు ‘3 పే రూ.2700 క్యాష్ బ్యాక్ ఆఫర్’ అందిస్తున్నది.
అయితే మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు తమ వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్లు బుక్ చేయాలి. ప్రారంభంలో న్యూ కస్టమర్ తొలి మూడు నెలల్లో తొలి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే రూ.900 క్యాష్ బ్యాక్ అవుతుంది.
ఇప్పటికే పేటీఎం ఖాతాదారులుగా ఉన్నవారు.. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకోవడంతో రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. రూ.5000 విలువైన రివార్డు పాయింట్లను రీడిప్ గిఫ్ట్‌లుగా వాడుకోవచ్చు లేదా పేటీఎం స్పెషల్ ఆఫర్ డీల్స్ ఉండాలి.
పేటీఎం నుంచి 3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం ఎలాగో తెలుసుకుందామా..!
పేటీఎం డాట్ కామ్‌కు వెళ్లి సిలిండర్ గ్యాస్-రీచార్జి అని క్లిక్ చేయాలి.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ సెక్షన్లోకి వెళ్లి బుక్ ఏ సిలిండర్ ఆప్షన్ నొక్కాలి.
భారత్‌గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ ల్లో మీ గ్యాస్ ప్రొవైడర్ పేరు క్లిక్ చేయాలి.
అటుపై ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి
తదుపరి కన్జూమర్ నంబర్ నమోదు చేయాలి..
తర్వాత లింక్డ్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ టైప్ చేయాలి.
బుకింగ్ అమౌంట్ ఎంటర్ చేసి.. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేశాక ప్రొసీడ్ కావాలి.
బుకింగ్ సక్సెస్ఫుల్ కాగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ధ్రువీకరణ మెసేజ్ లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్‌ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత