Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Amazon Big win on Reliance | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి......

Amazon Vs Future-Reliance Deal | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన అత్యవసర ఆదేశాలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారత్ చట్టాలకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో విలీనంపై ముందుకు వెళ్లొద్దని ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌ను శుక్రవారం జస్టిస్‌లు రోహింటన్ ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రెట్రో టాక్స్ రద్దు నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు
ఇప్పటికే రెట్రోస్పెక్టివ్ టాక్స్ విషయంలో కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ సంస్థలకు అనుకూలంగా అంతర్జాతీయ కోర్టులు తీర్పులు చెప్పాయి. ఈ పరిస్థితుల్లో రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టాన్ని రద్దు చేయాలంటూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ మరునాడే ఫ్యూచర్- రిలయన్స్ డీల్‌కు వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం గమనార్హం.
ఇలా సింగపూర్ కోర్టు మధ్యంతర ఆదేశాలు
రూ.24,713 కోట్ల విలువైన ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు.. ఆ డీల్‌పై స్టే విధించింది. అయితే, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్‌లోని 17వ సెక్షన్ ప్రకారం సింగపూర్ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఆమోదయోగ్యమైనని సుప్రీంకోర్టు పేర్కొంది.
సింగపూర్ కోర్టు వర్తించవన్న ఫ్యూచర్ గ్రూప్
ఫ్యూచర్ రిటైల్ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తూ సింగపూర్ కోర్టు ఆదేశాలకు భారత న్యాయ పుస్తకాల్లో చోటు లేదని వాదించారు. ఆర్బిట్రేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 17 కింద సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను అమలు చేయరాదన్నారు.
ఆర్బిట్రేషన్ ఆదేశాలు కేవలం సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద అమలు చేయాల్సి ఉంటుందని.. మధ్యవర్తిత్వ చట్ట ప్రకారం కాదన్నారు. కానీ సింగపూర్ కోర్టు ఆదేశాలకు ఫ్యూచర్ గ్రూప్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెజాన్ వాదించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

