e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News Home Buyers for Discounts | బంగారం వ‌ద్దు.. సొంతిల్లే ముద్దు.. బ‌ట్‌ డిస్కౌంట్ల‌కు డిమాండ్‌!

Home Buyers for Discounts | బంగారం వ‌ద్దు.. సొంతిల్లే ముద్దు.. బ‌ట్‌ డిస్కౌంట్ల‌కు డిమాండ్‌!

Home Buyers for Discounts | క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఇండియ‌న్ల‌పై భారీగానే ప్ర‌భావం చూపుతున్న‌ది. సొంతింటి కొనుగోలుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇండ్ల కొనుగోలును ప్రోత్స‌హించ‌డానికి బిల్డ‌ర్లు త‌మ‌కు రాయితీలు, ఉచిత బెనిఫిట్ల‌తోపాటు సుల‌భ‌త‌ర చెల్లింపుల ఆప్ష‌న్లు ఇవ్వాల‌ని కోరుతున్నారు. క‌రోనా వేళ‌.. ఉద్యోగాలు లేక‌.. వైర‌స్ బారిన ప‌డి దాదాపు భార‌తీయులంతా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు.

సుల‌భ‌త‌ర పేమెంట్స్‌కు 71% మంది మొగ్గు

ఈ త‌రుణంలో సుల‌భ‌త‌ర చెల్లింపుల ఆప్ష‌న్లు క‌ల్పించాల‌ని 71 శాతం మంది కోరుతున్నారు. ప్ర‌స్తుత క‌ష్ట కాలంలో ఫైనాన్సియ‌ల్ ఎయిడ్ అవ‌స‌రం అని అభిప్రాయ ప‌డుతున్నారు. రియాల్టీ పోర్ట‌ల్ హౌసింగ్ డాట్ కాం, రియాల్టీ బాడీ నారెడ్కో సంయుక్తంగా ఈ స‌ర్వే జ‌రిపాయి. జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య 3000 మందికి పైగా కొనుగోలుదారుల అభిప్రాయాల‌ను సేక‌రించాయి.

బంగారం కంటే ఇంటికే ఇలా ప్రియారిటీ

- Advertisement -

ఇంత‌కుముందు బంగారం, స్టాక్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో మ‌దుపుకు మొగ్గు చూపిన వారంతా సొంతిల్లు, స్థిరాస్తుల‌పై పెట్టుబ‌డి పెట్ట‌డం శ్రేయ‌స్క‌రం అని భావిస్తున్నార‌ని ఓ అధ్య‌య‌నం నిగ్గు తేల్చింది. గ‌తేడాది 28 శాతం మంది ఇండియ‌న్లు బంగారం కొనుగోలు చేయ‌డానికి మొగ్గు చూపితే, ఈ ఏడాది అది 18 శాతానికి ప‌డిపోయింది.

ఇండియ‌న్స్ పెట్టుబ‌డి ప్రాధాన్యాలివి..

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డుల‌కు 43 శాతం మంది (గతేడాది 35%), స్టాక్స్‌లో 20 శాతం (గ‌తేడాది 15%), ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో 19 శాతం (గ‌తేడాది 22 %) త‌మ సొమ్ము మ‌దుపు చేయ‌డానికి ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. ఆర్థిక రంగం దెబ్బ తిన‌డంతో బిల్డ‌ర్లు రుణ చెల్లింపులు స‌కాలంలో జ‌రుపాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అటువంటి వారంతా డిస్కౌంట్లు, ఉచిత బెనిఫిట్లు క‌ల్పిస్తున్నార‌ని నారెడ్కో ప్రెసిడెంట్ నిరంజ‌న్ హిరానందనీ చెప్పారు.

డిమాండ్‌-స‌ప్ల‌య్‌ను బ‌ట్టే ధ‌ర‌లు

ఇండ్ల‌కు గ‌ల డిమాండ్‌, అందుబాటులో ఉన్న యూనిట్ల‌ను బ‌ట్టి ధ‌ర ఖ‌రార‌వుతుంది. భారీ స్థాయిలో అమ్మ‌కాలు జ‌రుగ‌ని ఇండ్లు ఉన్న బిల్డ‌ర్లు డిస్కౌంట్లు ఇస్తే కొంత క‌స్ట‌మ‌ర్ల‌కు సానుకూలంగా మారుతుంద‌ని నిరంజ‌న్ హిరానంద‌నీ తెలిపారు.

కోవిడ్‌తో సొంతింటికి ప్రాధాన్యం

కోవిడ్ మ‌హ‌మ్మారితో త‌లెత్తిన ఇబ్బందులతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సొంతింటికి ప్రాధాన్యం పెరిగింద‌ని హౌసింగ్ డాట్ కాం సీఈవో ధ్రువ్ అగ‌ర్వాల్ చెప్పారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారితోపాటు ఇప్ప‌టికే ఇండ్లు ఉన్న వారు పెద్ద అపార్ట్‌మెంట్ కొనుగోళ్ల‌కు మొగ్గుతున్నారు.

చారిత్ర‌క స్థాయిలో క‌నిష్ట వ‌డ్డీరేట్లు

క‌ష్ట‌త‌ర ఆర్థిక ప‌రిస్థితుల్లోనూ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్లు ఇండ్ల‌ను విక్ర‌యించ‌డానికి చారిత్ర‌క స్థాయిలో క‌నిష్ట స్థాయికి చేరుకున్న వ‌డ్డీరేట్లు చేయూత‌నిస్తున్నాయి. ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా ఇండ్ల కొనుగోలుకు డిమాండ్ పెర‌గ‌డం కూడా ఒక కార‌ణ‌మేన‌ని స‌ర్వేలో తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో ర‌చ్చ‌.. ‘ముంజాల్స్‌’లో విభేదాలు.. ఎందుకంటే?!

Oxygen : చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్‌ కనిపెట్టిన ప్రీస్ట్లీ

Asaduddin Owaisi: మోదీకి హిందూ మ‌హిళ‌ల సాధికార‌త అక్క‌ర్లేదా..?

TS Cabinet : వ‌చ్చే ఏడాది నుంచి కొత్త మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం

TS Cabinet : 5 సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌

Sai Pallavi Tamil | కోలీవుడ్ క‌మ్‌బ్యాక్ కు సాయి ప‌ల్ల‌వి ప్లాన్..?

పుష్ప2 లో నెగెటివ్ రోల్ చేయ‌నున్న సోనూసూద్.. ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారా..!

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana