తిరుమలాయపాలెం, మే 30 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు శనివారం ఆందోళన నిర్వహించారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచాలని, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ డీటీ సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కమ్మకొమటి నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వరరావు, పులుగుజ్జు వెంకటస్వామి, గోకినపల్లి సరోజిని, యడ్లపల్లి నవీన్, రాయిండ్ల చిరంజీవి, వీరస్వామి, మీగడ సత్యం, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.