Gold Rates | న్యూఢిల్లీ, ఆగస్టు 19: బంగారం మరింత దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం రూ.500 తగ్గి రూ.1,00,420గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర కూడా రూ.450 తగ్గి రూ.1,00,050 గా నమోదైంది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల అధినేతల మధ్య చర్చలు జరుగుతుండటం వల్లనే పసిడి ధరలు దిగొచ్చాయని బులియన్ విశ్లేషకులు వెల్లడించారు.
వెండి ధరలు బాగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో రూ. 1,000 తగ్గి రూ.1.14 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,337.92 డాలర్లు, వెండి 38.09 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.