Stock Markets | వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-25) బడ్జెట్ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన శనివారం. సార్వత్రిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందున ఫిబ్రవరి ఒకటో తేదీన దేశీయ స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంచుతామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సోమవారం తెలిపాయి. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప.. శనివారం, ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు.
కానీ, 2025 ఫిబ్రవరి ఒకటో తేదీ (శనివారం)న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ పార్లమెంటుకు సమర్పిస్తున్నందున స్టాక్ మార్కెట్లు పని చేస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వేర్వేరు సర్క్యులర్లలో ప్రకటించాయి. ట్రేడింగ్ ఉదయం 9.15 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.30 గంటల వరకూ కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఇంతకు ముందు 2015 ఫిబ్రవరి 28 (శనివారం), 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ (శనివారం) స్టాక్ మార్కెట్లు నడిచాయి. 2001లో బడ్జెట్ సమర్పణ సమయం మార్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు రోజువారీ ట్రేడింగ్ సమయంలోనే పని చేస్తాయి.