Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 789 పాయింట్లు లాభపడి 75,398.72 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 277 పాయింట్లు లాభపడి 24,689.60 వద్ద ముగిసింది. కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో మార్కెట్లు లాభాలబాటలో నడిచాయి.
సెన్సెక్స్ ఉదయం 74,947 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75,681 గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 75,398 వద్ద ముగిసింది. 30 షేర్స్ బీఎస్ఈ ఇండెక్స్‌లో భారతి ఎయిర్టెల్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా సంస్థలు భారీ లాభాలు గడించాయి. మారుతి, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థల షేర్లు నష్టపోయాయి. భాతర మార్కెట్లు గత నాలుగు సెషన్లలో 4 శాతం పైగా నష్టపోయాయి. క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ.. చమురును జాగ్రత్తగా వాడుకోవాలని సూచించిన నేపథ్యంలో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
అంతర్జాతీయ మార్కెట్లైన జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. భారత మార్కెట్లు లాభాలు చూసినప్పటికీ డాలర్‌తో రూపాయి మార్కెట్ విలువ మాత్రం తగ్గిపోయింది. గురువారం డాలర్‌తో రూపాయి విలువ తగ్గిపోయి 95.73 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర కూడా పెరిగింది. గురువారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 0.50 పెరిగి, 106.16 వద్ద కొనసాగుతోంది.