న్యూఢిల్లీ : ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది. అన్ని రకాల బీఎండబ్ల్యూ మోడల్ కార్లపై 2 శాతం వరకూ ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోజిన్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎక్స్7, మినీ కంట్రీమన్, బీఎండబ్ల్యూ జడ్4, బీఎండబ్ల్యూఎం4 కూపే, బీఎండబ్ల్యూ ఎక్స్3, ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎం5, బీఎండబ్ల్యూ ఎం8 కూపే, బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వంటి పలు మోడల్స్ భారత్‌లో తయారవువున్నాయి.
పలు రకాల కారణాలతో అన్ని మోడల్స్ కార్ల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రం పవా పేర్కొన్నారు. బీఎండబ్ల్యూ గ్రూప్ సబ్సిడరీ బీఎండబ్ల్యూ ఇండియాలో రూ. 520 కోట్లు పెట్టుబడులు పెట్టింది. చెన్నైలో తయారీ ప్లాంట్‌తో పాటు పుణేలో విడిపరికాల గోడౌన్, గురుగ్రాంలో ట్రైనింగ్ సెంటర్‌ను బీఎండబ్ల్యూ ఇండియా నిర్వహిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ బీఎండబ్ల్యూ డీలర్ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.
Read More :
Vivo X100 | 14న వివో ఎక్స్100, ఎక్స్100 ప్రొ గ్లోబల్ లాంఛ్ : హాట్ డివైజ్‌ల ధర ఎంతంటే..!