న్యూఢిల్లీ : నవంబర్‌లో చైనాలో లాంఛ్ చేసిన వివో ఎక్స్100, (Vivo X100) ఎక్స్100 ప్రొ స్మార్ట్ఫోన్లను కంపెనీ గ్లోబల్ మార్కెట్లో డిసెంబర్ 14న లాంఛ్ చేయనుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ప్రకటన చేయడంతో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియుల్లో ఉత్సుకత నెలకొంది. న్యూ స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఈ హాట్ డివైజ్‌లను సొంతం చేసుకోవాలని కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
గత నెలలో చైనాలో ఈ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన సమయంలో వివో ఎక్స్100 ధర రూ. 45,600 కాగా, ఎక్స్100 ప్రొ సిరీస్ ధర దాదాపు రూ. 57,000గా నిర్ణయించారు. అయితే గ్లోబల్ మార్కెట్లలో వీటి ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ హాట్ డివైజ్‌లు చైనాలో ప్రస్తుతం బ్లాక్, బ్లూ, సన్‌సెట్ ఆరంజ్, వైట్ మూన్లైట్ కలర్స్‌లో లభిస్తున్నాయి.
వివో ఎక్స్100, ఎక్స్100 ప్రొ 6.78 ఇంచ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఇక కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే వివో ఎక్స్100 సోనీ ఐఎంఎక్స్ వీసీఎస్ సెన్సర్, జీస్ లెన్స్‌తో 64ఎంపీ టెలిఫొటో కెమెరాతో పాటు 50ఎంపీ మెయిన్ సెన్సర్ కలిగిఉంది. రెండు డివైజ్‌లు 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగిఉంటాయి, ఇక ఎక్స్100 100డబ్ల్యూ చార్జర్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఇక ఎక్స్100 ప్రొ 120డబ్ల్యూ వైర్డ్ చార్జర్‌తో 5400ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది.
Read More :