న్యూఢిల్లీ, జూన్ 7: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీస్‌పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ క్లీన్చిట్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ జీఎస్టీ ఎగవేతకు సంబంధించి గతేడాది జీఎస్టీ ఇంటిలిజెన్స్‌తో మూడుదఫాలుగా సమావేశమై స్పష్టతనిచ్చినట్టు, దీంతో ఈ షోకాజ్ నోటీసును వెనక్కితీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. జూలై 2017 నుంచి మార్చి 2022 మధ్య ఇన్ఫోసిస్ విదేశీ శాఖల్లో జరిగిన వ్యయాలకు సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీసును గతేడాది జూలైలో ఇన్ఫోసిస్ అందుకున్నది.