గత నెల ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచినా.. కొన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆకర్షణీయ వడ్డీరేట్లను కొనసాగిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సహా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ జాబితాలో ఉండగా.. తద్వారా జనరల్ డిపాజిటర్లు, సీనియర్ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..