బుధవారం 03 జూన్ 2020
Business - May 17, 2020 , 23:37:08

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ

కరోనా వైరస్‌ ధాటికి కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి గత మంగళవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు విడుతల్లో ఈ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించారో ఒక్కసారి పరిశీలిస్తే..

 • మొత్తం 20,97,053 కోట్ల ప్యాకేజీ తొలి విడుత 5,94,550 కోట్లు
 • రెండో విడుత 3,10,000 మూడో విడుత 1,50,000 కోట్లు
 • నాలుగు- ఐదు విడుతలు  48,100 కోట్లు
 • గతంలో ప్రధాని గరీభ్‌ కల్యాణ్‌ యోజన కింద 1,92,800 కోట్లు
 • అంతకుముందు ఆర్బీఐ నిర్ణయాల ద్వారా 8,01,603 కోట్లు

మొదటి విడుత

 • ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలు 3 లక్షల కోట్లు
 • ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈల కోసం 20 వేల కోట్లు
 • ఎంఎస్‌ఎంఈల కోసం ఫండ్‌ ఫర్‌ ఫండ్స్‌ 50 వేల కోట్లు
 • వ్యాపారులు, కార్మికుల కోసం ఈపీఎఫ్‌ మద్దతు 2,800 కోట్లు
 • ఈపీఎఫ్‌ రేట్లలో తగ్గింపు 6,750 కోట్లు
 • ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ/ఎంఎఫ్‌ఐలకు నగదు 30 వేల కోట్లు
 • ఎన్‌బీఎఫ్‌సీ/ఎంఎఫ్‌ఐలకు పాక్షిక రుణ పూచీకత్తు 45 వేల కోట్లు
 • డిస్కంలకు నగదు సాయం 90 వేల కోట్లు
 • టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లలో తగ్గింపు 50 వేల కోట్లు

రెండో విడుత

 • వలస కార్మికులకు ఉచిత ఆహార పంపిణీ 3,500 కోట్లు
 • ముద్ర-శిశు రుణాలపై వడ్డీ రాయితీ 1,500 కోట్లు
 • వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సాయం 5 వేల కోట్లు
 • సీఎల్‌ఎస్‌ఎస్‌-ఎంఐజీ హౌజింగ్‌ 70 వేల కోట్లు
 • నాబార్డు ద్వారా అదనపు అత్యవసర మూలధనం 30 వేల కోట్లు
 • కేసీసీ ద్వారా అదనపు రుణం 2 లక్షల కోట్లు


మూడో విడుత 

 • సూక్ష్మ ఆహార సంస్థలు 10 వేల కోట్లు
 • పీఎం మత్స్య సంపద యోజన 20 వేల కోట్లు
 • కూరగాయలు, పండ్ల పంటల ప్రోత్సాహానికి 500 కోట్లు
 • వ్యవసాయ మౌలిక నిధి 1 లక్ష కోట్లు
 • పశుసంవర్ధక మౌలిక అభివృద్ధి నిధి 15 వేల కోట్లు
 • మూలికా సాగు ప్రోత్సాహానికి 4 వేల కోట్లు
 • తేనె, అనుబంధ ఉత్పత్తుల కోసం 500 కోట్లు

నాలుగు-ఐదు విడుతలు

 • మౌలిక ప్రాజెక్టుల అభివద్ధికి 8,100 కోట్లు
 • అదనపు ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ కేటాయింపులు 40 వేల కోట్లు

సగం ప్యాకేజీ ఆర్బీఐదే

మెగా ఉద్దీపన ప్యాకేజీ అంటూ ఊరించి ఉసూరుమనిపించింది కేంద్ర ప్రభుత్వం. ప్రకటించిన రూ.20 లక్షల కోట్లలో రూ.8 లక్షల కోట్లకుపైగా రిజర్వ్‌ బ్యాంక్‌ గతంలో తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి మరి. దేశంలో ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఈ ఏడాది మార్చి నుంచి ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీటి విలువ రూ.8.01 లక్షల కోట్లు. అయితే ఇవన్నీ కూడా తమ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగమేనని ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంతేగాక అంతకుముందు ప్రకటించిన రూ.1.92 లక్షల కోట్ల ఉద్దీపన కూడా ఇందులోదేనన్నారు.  


logo