Jai Anmol | బ్యాంకులను మోసం చేసిన కేసు (banking fraud case)లో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఆయన కుమారుడు జై అన్మోల్ అంబానీ (Jai Anmol Ambani)పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) తాజాగా క్రిమినల్ కేసు (criminal case) నమోదు చేసింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) తో ముడిపడి ఉన్న బ్యాంకింగ్ మోసం కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసం, నేరపూరిత కుట్ర కారణంగా బ్యాంకుకు రూ.228.06 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో ఆర్హెచ్ఎఫ్ఎల్ మాజీ సీఈవో, డైరెక్టర్ రవీంద్ర సుధాల్కర్ సహా పలువురి పేర్లు కూడా ఉన్నాయి. యెస్ బ్యాంక్-రిలయన్స్ గ్రూప్ కేసుకు సంబంధించిన చార్జిషీట్లో రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నిప్పాన్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సమయంలో జై అంబానీ పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. గతంలో బ్యాంకు మోసాల కేసుల్లో అనిల్ అంబానీపై సీబీఐ,ఈడీలు దర్యాప్తు చేసినప్పటికీ కుమారుడు జై అంబానీపై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Also Read..
Sonia Gandhi | పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో పేరు.. సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు
PM Modi | ప్రభుత్వ నిబంధనలతో పౌరులు ఇబ్బందులు పడకూడదు.. ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ