Air India to TATA | భారత్ నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమాన సర్వీసులు అవసరమైన వేళ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకోనున్నది. ఆర్థిక సంక్షోభం.. అప్పుల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ 2019లో మూత పడిన తర్వాత విదేశాలకు సర్వీసులు నడిపే విమానయాన సంస్థల్లేకుండా పోయాయి. ప్రతి ఏటా నాలుగు కోట్ల మంది విదేశాలకు వెళ్లే వారు.. విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించాల్సి వస్తోంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో భారతీయులే 61 శాతం మంది ఉంటారు. ఇటువంటి వారి ప్రయాణానికి ఇక టాటాల ఆధ్వర్యంలోని ఎయిర్ఇండియా.. ట్రంప్‌కార్డ్ కానున్నదని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఎయిర్‌లైన్స్ నుంచి ఇండియన్ ప్యాసింజర్స్ మార్కెట్‌ను ఆకర్షించగల శక్తి సామర్థ్యాలు ఎయిర్ ఇండియాకు ఉన్నాయని సమాచారం.
ఉత్తర అమెరికాతోపాటు యూరప్ దేశాలు, జపాన్, గల్ఫ్ దేశాలు, అమెరికాలో జేఎఫ్‌కే, లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఎయిర్ ఇండియాకు 900 పార్కింగ్, ల్యాండింగ్ స్లాట్స్ ఉన్నాయి. వీటితోపాటు భారత్‌కు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 900 ఇంటర్నేషనల్ అండ్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఎయిర్ ఇండియా నిత్యం 30 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ ఉంటుంది.
ఎయిర్ ఇండియా నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల రంగంలో తమ సంస్థ గట్టిపోటీని ఎదుర్కోనున్నదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి టమ్ క్లార్కే విశ్వసించారు. ఎయిర్ ఇండియా నూతన యాజమాన్యానికి అవకాశాలు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
TATA-Air India | టాటాసన్స్కు ఎయిరిండియా మేనేజ్మెంట్ వీజీ కాదా..?!
Fixed Diposits | ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. 7 శాతం వడ్డీ వరకు ఆఫర్!
TATA-Air India | ఎయిరిండియా టెక్నికల్ సపోర్ట్ ఇక టీసీఎస్ చేతికి..!
AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్‌లో అమెజాన్ ఉచిత శిక్షణ..!