AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్‌లో అమెజాన్ ఉచిత శిక్షణ..!
AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్‌లో నిపుణుల కొరతను అధిగమించేందుకు లెర్నర్స్‌కు అమెజాన్ వెబ్ సర్వీసెస్ 3 నెలలు శిక్షణ ఇస్తుంది.

AWS Cloud Training | మీరు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్నారా.. మీకు ఎటువంటి టెక్నాలజీ లేకున్నా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్ కావచ్చు. అందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ముందుకు వస్తోంది. భారత్‌లో ఎడబ్ల్యూఎస్ సర్వీస్‌లను అమెజాన్ పునఃప్రారంభిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్లో లెర్నర్ల కోసం ఫ్రీ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. 12 వారాల పాటు జరిగే ఈ శిక్షణలో ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. టెక్నాలజీ ఎక్స్‌పీరియెన్స్ కూడా అవసరం లేదని తెలిపింది. ఇంటర్వ్యూయింగ్, రిజ్యూమె రైటింగ్ వంటి ఫండమెంటల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ స్కిల్స్, ప్రాక్టికల్ కెరీర్ స్కిల్స్‌లో నైపుణ్యం ఆధారిత శిక్షణ అందిస్తుంది.
ఇలా కెరీర్ సపోర్ట్
రియల్ వరల్డ్, దృష్టాంత ఆధారిత ఎక్సర్సైజ్లు, ల్యాబ్స్, కోర్స్ వర్క్, స్టూడెంట్స్ బిల్డ్ లినక్స్, పైథాన్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, రిలేషన్ డేటాబేస్ స్కీల్స్లో విక్షణ ఇస్తారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆపరేషన్స్‌లో ఎంట్రీ లెవల్ క్లౌడ్ రోల్స్, సైట్ రిలయబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అందిస్తారు.
ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయడానికి మాత్రం శిక్షణ పొందుతున్న వారి నుంచి రుసుము వసూలు చేస్తారు. వారికి ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ క్రెడెన్షియల్తోపాటు క్లౌడ్ స్కిల్స్ కలిగి ఉన్నారని సదరు సర్టిఫికెట్ ధృవీకరిస్తుంది. ప్రస్తుతం 25 దేశాల్లో ఏడబ్ల్యూఎస్ సేవలను పునఃప్రారంభించింది.
క్లౌడ్ స్కిల్స్ వర్కర్స్కు ఫుల్ డిమాండ్
అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియా ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ హెడ్ అమిత్ మెహతా మాట్లాడుతూ క్లౌడ్ స్కిల్డ్ వర్కర్ల కోసం ఐటీ రంగంలో డిమాండ్ ఉంది. క్లయింట్లకు క్లౌడ్ సర్వీసులను అందించేందుకు ప్రతిభావంతులు అవసరం. అందుకు అనుగుణంగా క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల నియామకం కోసం ఐటీ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
నిపుణుల కొరతను అధిగమించేందుకు సంప్రదాయేతర వనరుల నుంచి తప్పనిసరిగా క్లౌడ్ టాలెంట్‌ను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి నైపుణ్యం లేకపోయినా క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్ ప్రారంభించేలా వారిని తీర్చిదిద్దుతుంది.
ఏడబ్ల్యూఎస్ పార్టనర్ క్యాప్‌జెమినీ
కన్సల్టింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ సర్వీస్‌ల్లో ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ గ్లోబల్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థకు భారత్‌లో 1.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఏడబ్ల్యూఎస్ పునఃప్రారంభానికి, వివిధ క్లౌడ్ రోల్స్‌లో నిపుణుల నియామకాల కోసం ఇంటర్వ్యూలకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏడబ్ల్యూఎస్ పార్టనర్‌గా ఎడ్ బ్రిడ్జి లెర్నింగ్ అందుబాటులోకి తేవడానికి క్యాప్‌జెమినీ కృషి చేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు
Offline Digital Payments | త్వరలో ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్
US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- aws cloud
- skill training
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

