US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?

US trillion dollar coin | అగ్రరాజ్యం అమెరికాలో నగదు నిల్వలు నిండుకొన్నాయి. ప్రభుత్వ రాబడి తగ్గింది. బిల్లులు చెల్లించడానికి డబ్బుల్లేవు. కనీసం ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఈ నగదు సంక్షోభాన్ని నివారించేందుకు ఆ దేశం మునుపెన్నడూ లేని విధంగా వినూత్న చర్యలకు సిద్ధమైంది. అమెరికా ఫెడెరల్ ప్రభుత్వం రూ.75 లక్షల కోట్ల ముఖ విలువ కలిగిన ప్లాటినం నాణేన్ని (1 ట్రిలియన్ డాలర్లు – us trillion dollar coin ) ముద్రించి దాని ద్వారా ట్రెజరీ నుంచి నగదును అప్పుగా తీసుకోవాలని భావిస్తున్నది. ఇందుకు బైడెన్ సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 2001లో చేసిన ఓ చట్టం అమెరికా అధ్యక్షుడికి ఈ అధికారాన్ని ఇస్తున్నది. అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్ (చట్టసభలు) ఆమోదం లేకపోయినా ప్లాటినం నాణేన్ని ముద్రించడానికి ట్రెజరీని ఆదేశించవచ్చు. దాని ముఖ విలువ ఎంతన్న దానితో సంబంధం లేదు. కానీ, బంగారం, వెండి, నికెల్, రాగి నాణేల ముద్రణకు అధ్యక్షుడు ఏకపక్షంగా ఆదేశించరాదు. వీటి ముద్రణకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.
కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా
ఏదైనా దేశం రుణం తీసుకోవడంలో ఆ దేశ బడ్జెట్‌ను బట్టి నిర్దిష్ట పరిమితి ఉంటుంది. అమెరికాకు కూడా రుణ పరిమితి ఉంది. దీనిని ట్రెజరీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం 28.5 ట్రిలియన్ డాలర్ల వరకు ట్రెజరీ నుంచి అప్పుగా తీసుకోవచ్చు. అయితే, అమెరికా చట్టసభ్యులు 1993 నుంచి ఇప్పటివరకు 25 సార్లు రుణ పరిమితిని పెంచారు. ఇలా రుణ పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం. ఈ ప్రతిపాదన కాంగ్రెస్‌కు వెళ్తే రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. అందుకే కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ట్రెజరీ నుంచి నగదు తీసుకోవాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు.

ఒబామా హయాంలోనూ ప్రస్తావన
ప్రస్తుతం ట్రెజరీ వద్ద ఉన్న నగదు నిల్వలు అక్టోబర్ 18తో అయిపోతాయి. బిల్లుల చెల్లింపులకు 2 లక్షల ట్రిలియన్ డాలర్లు తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో కాయిన్‌ను తనఖా పెట్టి అదనపు నగదును ముద్రించాలని బైడెన్ సర్కారు ట్రెజరీని ఆదేశించే అవకాశం ఉంది. 2011లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నగదు సంక్షోభాన్ని అధిగమించడానికి ట్రిలియన్ డాలర్ కాయిన్ ప్రస్తావన వచ్చింది. ఈ విషయాన్ని ఒబామానే స్వయంగా 2017లో చెప్పారు.

మన లొసుగులు ప్రపంచానికి చెప్పాలా..
ట్రిలియన్ డాలర్ కాయిన్ ముద్రణ ప్రతిపాదనను ట్రెజరీ సెక్రెటరీ జానెట్ ఎల్లెన్ వ్యతిరేకించారు. ‘అమెరికా ఎలా అప్పు చెల్లిస్తుందో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏముంది’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ట్రిలియన్ డాలర్ కాయిన్ ఫెడెరల్ రిజర్వ్ అండ్ ట్రెజరీ స్వతంత్రతను, దానిపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అన్నారు. ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి అదనంగా డబ్బు ముద్రించడం సరికాదన్నారు. డబ్బు ఎక్కువగా మార్కెట్లోకి పంపిణీ జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, డాలర్ విలువ పడిపోతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

