TATA-Air India | ఎయిరిండియా టెక్నికల్ సపోర్ట్ ఇక టీసీఎస్ చేతికి..!
TATA-Air India | టాటా సన్స్‌కు అప్పగించాక ఎయిరిండియాకు కొత్త సారధి రానున్నారు. దాని కాయకల్ప చికిత్సకు రంగం సిద్ధమైంది.

TATA-Air India | టాటా సన్స్ పరమైన ఎయిరిండియాకు త్వరలో కొత్త సీఈవో రానున్నారా.. అదీ కూడా విదేశీ ఎయిర్‌లైన్స్‌కు సారధ్యం వహించిన అనుభవజ్ఞులైన విదేశీయుడు సారధ్యం వహించబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతే కాదు.. కొత్త డైరెక్టర్ల బోర్డు కూడా రాబోతున్నది. అధికారికంగా మహారాజాను టేకోవర్ చేసిన తర్వాత దాని నిర్వహణపై టాటా సన్స్ ఇప్పటికే దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది. అంతర్జాతీయ విమానయానంలో ఎయిర్ ఇండియాను పోటీలో మెరుగైన స్థానంలో నిలపాలని టాటాలు తలపోస్తున్నారు.. అందులో భాగంగా సంస్థలో పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఆపరేషన్స్ క్రమబద్ధీకరించనున్నారు.
ఎయిరిండియా బలోపేతానికి ఇలా..
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎయిరిండియా ఆపరేషన్ మోడల్, వ్యయ వ్యవస్థకు పూర్తిగా కాయకల్ప చికిత్స చేయనున్నారు. టాటా సాట్స్, టీసీఎస్ మాదిరిగా ఎయిర్ ఇండియా శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు చర్యలు చేపడతారు. భారత్ మినహా పలు దేశాల ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల ఐటీ సిస్టమ్స్, అప్లికేషన్స్ నిర్వహించేది టీసీఎస్ కావడం గమనార్హం.
టీసీఎస్ చేతుల్లోకి ఎయిరిండియా
కేంద్రం నుంచి ఎయిరిండియా అప్పగింత పూర్తయ్యాక సంస్థ ఐటీ, డిజిటల్ ఆపరేషన్స్‌ను టీసీఎస్ పూర్తిగా పర్యవేక్షించనున్నది. ఇప్పటికే సింగపూర్ ఎయిర్‌లైన్స్-టాటా సన్స్ జాయింట్ వెంచర్విస్తారాకు టీసీఎస్ టెక్నాలజీ పార్టనర్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఐటీ, డిజిటల్ సిస్టమ్స్ పర్యవేక్షణ బాధ్యత కూడా టీసీఎస్‌దే.
ఇలా కమర్షియల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్
ఇక సంస్థకు నూతన నాయకత్వాన్ని సమకూర్చడంతోపాటు వ్యయభరితమైన రుణాల పునర్వ్యవస్థీకరణ, హైకాస్ట్ వెండార్ కాంట్రాక్ట్స్ కోసం రీ నెగోషియేషన్స్ తదితర చర్యలు చేపట్టబోతున్నారు. టాటా సన్స్‌లోని సౌరభ్ అగర్వాల్ సారధ్యంలోని ఫైనాన్స్ టీం.. ఎయిరిండియాలో కమర్షియల్ ప్రాబ్లమ్స్‌కు కారణాలను వెలికితీస్తారు.
రతన్‌టాటా చైర్మన్ ఎమిరస్.. చంద్రా చైర్మన్
టాటా సన్స్ చైర్మన్ చంద్రకు వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థల సీఈవోలు, సీనియర్ లీడర్షిప్ కొట్టిన పిండి. ఇక టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులు కాకముందు చంద్ర.. టీసీఎస్ సీఈవోగా పని చేసిన సంగతి తెలిసిందే. టాటా సన్స్ ఎమిరస్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఎయిరిండియా బోర్డుకు చంద్ర సారధ్యం వహిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు
Offline Digital Payments | త్వరలో ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్
US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

