న్యూఢిల్లీ, జూన్ 17: బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు తొలి విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు జూన్ 15 చివరితేదీ.
తాజా వసూళ్లలో కార్పొరేట్లు చెల్లించినవి రూ.92,173 కోట్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను అడ్వాన్స్ చెల్లింపులు రూ.23,513 కోట్లకు చేరాయి. కార్పొరేట్ పన్ను చెల్లింపులు 17 శాతం, వ్యక్తిగత చెల్లింపులు 6 శాతం చొప్పున వృద్ధిచెందాయి.