ముంబై: భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు ఇవాళ అనూహమైన షాక్‌కు గురయ్యాయి. సుమారు 1.35 లక్షల కోట్ల విలువైన స్టాక్స్(Indian Stock Markets) కుప్పకూలినట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఐటీ కన్సల్టెన్సీ యాక్సెంచుర్ కంపెనీ ఇచ్చిన రెవన్యూ రిపోర్టు.. భారతీయ ఐటీ కంపెనీలను తీవ్రంగా షేక్ చేసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీలో 8.5 శాతం ట్రేడింగ్ తగ్గిపోయింది. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో ఇవాళ ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు 8.59 శాతం, టెక్ మహేంద్ర షేర్లు 7 శాతం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 6.52, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 6 శాతం, విప్రో షేర్లు 4.29 శాతం పడిపోయాయి.
యాక్సెంచుర్ ఇచ్చిన ఆదాయ రిపోర్టు నేరుగా భారతీయ ఐటీ కంపెనీల స్టాక్స్‌పై ప్రభావం చూపింది. కృత్రిమ మేధ వల్ల వృద్ధి తగ్గనున్నట్లు ఇటీవల యాక్సెంచుర్ కంపెనీ తన ఆదాయ రిపోర్టును అంచనా వేసింది. ఆ నివేదిక ఇప్పుడు భారతీయ ఐటీ కంపెనీల్లో వణుకు పుట్టించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఒక్కసారిగా కుదేలైంది. టెకీ ప్రాజెక్టుల కోసం ఎక్కువగా ఇండియన్ కంపెనీలన్నీ యాక్సెంచుర్ సంస్థపైనే ఆధారపడడం వల్ల.. యాక్సెంచుర్ ఇచ్చిన రిపోర్టు భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
యావత్ ఐటీ రంగానికి యాక్సెంచర్ వార్నింగ్ ఇవ్వడంతో.. పెట్టుబడిదారులు తమ స్టాక్స్‌ను తీసేసుకుంటున్నట్లు బజాజ్ బ్రోకింగ్ నిపుణుడు శశ్వంత్ సింగ్ తెలిపారు. గత అయిదు రోజుల నుంచి దూకుడును ప్రదర్శించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ అనూహ్య రీతిలో స్పందించాయి. సెన్సెక్స్, నిఫ్టీల్లో ట్రేడింగ్ అకస్మాత్తుగా పడిపోయింది. యాక్సెంచర్ ఇచ్చిన గైడెన్స్ సందేశం. భారతీయ ఐటీ కంపెనీలను తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసినట్లు జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు.