Cash WithDrawals With UPI | ఇప్పుడంతా డిజిటల్.. ఆన్లైన్ చెల్లింపుల యుగం.. మొబైల్ రీచార్జి మొదలు కాలేజీ ఫీజుల చెల్లింపుల వరకు.. గ్రాసరీ కొనుగోళ్లు మొదలు సినిమా టికెట్ల కొనుగోళ్ల వరకూ.. అంతా ఆన్లైన్.. యూపీఐ యాప్స్‌తో చెల్లింపులే.. దాదాపు ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, జీ-పే, పేటీఎం, భారత్ పే వంటి యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.
కానీ, ప్రతి చోటా డిజిటల్ పేమెంట్స్ కుదరకపోవచ్చు. నగదు చెల్లింపులు చేయాల్సి రావచ్చు. కనుక యూపీఐ యాప్స్ సాయంతో ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తున్నది. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకుండానే జీ-పే, పేటీఎం, ఫోన్‌పే ద్వారా ఏటీఎం వద్ద నగదు విత్‌డ్రాయల్స్ చేయొచ్చు. అయితే, ఒక ట్రాన్సాక్షన్లో రూ.5000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ వల్ల కార్డు స్క్రిమ్మింగ్, క్లోనింగ్ ముప్పు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
ఆర్బీఐ ప్రతిపాదనకు అనుగుణంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. యాప్స్ ద్వారా ఇంటరోపరేబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ (ఐసీసీడబ్ల్యూ) ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో యూజర్లు తమ యూపీఐ యాప్స్‌ను ఉపయోగించి ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతం కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లకు మాత్రమే కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
యాప్ సాయంతో ఏటీఎం వద్ద క్యాష్ విత్ డ్రాయల్ చేయాలనుకుంటున్నారా.. మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్‌కు లింక్డ్ జీ-పే, ఫోన్‌పే, భీమ్ వంటి యూపీఐ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి.