ATMs | ఏటీఎమ్‌లలో (ATMs) రూ.100, రూ.200 నోట్ల లభ్యత పెరిగింది. ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింత అందుబాటులో ఉండేలా ఏటీఎమ్‌లలో ఆయా డినామినేషన్ నోట్ల (denomination currency) లభ్యతను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 నాటికి ఈ నోట్ల లభ్యత పెంచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.
దశల వారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎమ్ ఆపరేటర్లకు సూచించింది. ఈ మేరకు 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎమ్‌లలో కనీసం ఒక్క క్యాసెట్‌లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని డెడ్‌లైన్ పెట్టింది. అంతేకాదు 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం పెంచాలని పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా డెడ్‌లైన్‌కు ముందే రూ.100, రూ.200 నోట్ల లభ్యత 70 శాతానికిపైగా పెరగడం విశేషం. గతేడాది డిసెంబర్లో 65 శాతంగా ఉన్న ఈ నోట్ల లభ్యత ప్రస్తుతం 73 శాతానికి చేరింది. దేశంలోనే అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ (CMS Info Systems) ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని మొత్తం 2,15,000 ఏటీఎమ్‌లలో 73,000 ఏటీఎమ్‌లను నిర్వహిస్తోంది.
Also Read..
పరిశ్రమ రాదు.. ఉపాధి లేదు.. కాంగ్రెస్ పాలనలో కనిపించని ప్రభుత్వ చొరవ!
బ్యాలెన్స్ చెకింగ్ పరిమితం!.. త్వరలో గూగుల్ పే, ఫోన్‌పే తదితర యూపీఐ యాప్స్‌పై నిర్ణయం: ఎన్పీసీఐ