హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సింగరేణి వ్యాపార విస్తరణ పనుల్లో జాప్యంపై సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల్లో నిర్లక్ష్యం తగదని, మందకొడిగా పనులు కొనసాగితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.
సింగరేణి భవన్ నుంచి వ్యాపార విస్తరణ పనులపై ఆయన సమీక్షించారు. మొత్తం 28 రకాల ప్రాజెక్ట్‌లపై సంబంధిత అధికారులతో చర్చించిన ఆయన..మరో పది రోజుల్లో ప్రగతి కనిపించాలని ఆదేశించారు.