న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ గ్రాండ్ విటారాను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.11.42 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.20.68 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు ప్రీమియం లుకింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తొమ్మిది అంగుళాల స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ చార్జింగ్ డాక్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.