శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Beauty-tips - Jan 19, 2021 , 00:12:17

‘కళ’బంద

‘కళ’బంద

ఆయుర్వేదంలో అలోవెరా (కలబంద) స్థానం ప్రధానమైంది. ఎన్నో ఔషధాల తయారీలో కలబందను వాడుతారు. సౌందర్యాన్ని ఇనుమడింపజేసే లక్షణాలూ ఇందులో ఉన్నాయి. 

  • ఒంటికి కలబంద వన్నె తెస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై తేమను ఆరిపోనివ్వదు. ఇందులోని  యాంటీ ఆక్సిడెంట్స్‌, ఖనిజాలు చర్మాన్ని కాంతిమంతం చేస్తాయి. అలోవెరా, బియ్యపు పిండి, టీ ట్రీ ఆయిల్‌లను మేళవించి ఫేస్‌మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. 
  • అలోవెరాలోని ప్రోటియోలైటిక్‌ ఎంజైమ్స్‌ మాడుపై పాడైన కణాలను బాగు చేస్తాయి. కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, త్వరగా జుట్టు పెరిగేలా చేస్తాయి. అలోవెరా రాయటం వల్ల కేశాలు మృదువుగా, మెత్తగా మారుతాయి.
  • జుట్టు ఊడిపోవటం ఆగాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా కలబంద గుజ్జు చక్కని మార్గం. దీనిలోని యాంటీ ఫంగల్‌ లక్షణాలు చుండ్రునూ నివారిస్తాయి.
  • కొబ్బరినూనె, అలోవెరా గుజ్జు సమాన పరిమాణాల్లో కలిపి వారానికి రెండుసార్లు తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇదొక అద్భుతమైన కండిషనర్‌. 

VIDEOS

logo