అశ్వారావుపేట: తెలంగాణ సంస్కృతికీ , సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ, పసుపులేటి ఫణీంద్ర (నాని) అన్నారు. పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. పట్టణంలో శనివారం జరిగిన బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగలను నిరుపేదలు కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు.