శనివారం 27 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 20, 2021 , 02:33:58

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

కొత్తగూడెం, జనవరి 19: గణతంత్ర  వేడుకలకు ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అన్ని శా ఖల అధికారులతో సమీక్షించారు. గణతంత్ర వే డుకలకు ఆయా శాఖల జిల్లా అధికారులకు కేటాయించిన విధులను ఈ నెల 22 నాటికి పూర్తి చే యాలని చెప్పారు. కార్యక్రమాలకు ప్రత్యే క పర్యవేక్షణ అధికారిగా ఇన్‌చార్జి ఆర్డీవో అనుదీప్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించినట్లు చెప్పారు. 

ఫిబ్రవరి నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ నెల 25నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పాఠశాలలు, కళాశాలలు నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి ఏర్పాట్లు పర్యవేక్షణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీఆర్‌వో అశోక చక్రవర్తి, డీఈవో సోమశేఖరశర్మ, డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు, డీపీవో రమాకాంత్‌, డీఏవో అభిమన్యుడు, సుధాకర్‌, తిరుమలేష్‌, నళిని, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo